Home

»

Latest News

Ntr: ఎన్టీఆర్ పై భానుచందర్ కీలక వ్యాఖ్యలు

Apr 27, 2026 2:32PM

 

మహానటుడు, తెలుగు వారి ఆస్తి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు(Ntr)గారి గురించి చెప్పుకోవాలన్నా, అయన గురించి ఒక వార్త పుట్టాలన్నా ఎంతో మందికి పెట్టి పుట్టాలనే నానుడి చాలా బలంగా ఉంది. అంతలా అమరత్వాన్ని పొందిన అమరుడిగా అభిమానుల,ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించాడు. అలాంటి వ్యక్తి గురించి ఒకప్పటి హీరో, ప్రముఖ నటుడు భానుచందర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అప్పుడే ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఊడిపడ్డ నోట్లు లాగా తళతళలాడుతున్నాయి. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

 
భానుచందర్(Bhanu Chander)మాట్లాడుతు ఎన్టీఆర్ గారు మా ఇంటికి ఒకసారి వచ్చారు. ఆయన వెళ్తుండగా మా అమ్మ ఉండే పోర్షన్‌ కి  రానందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఎన్టీఆర్ తన వెంట వచ్చిన పెద్ద కాన్వాయ్‌ను గేట్ దగ్గరే ఆపి, ఒక్కరే 60 మెట్లు ఎక్కి పై అంతస్తులోని మా అమ్మ పోర్షన్‌కి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు.. ఆ సందర్భంలో నువ్వు గొప్ప ఆర్టిస్ట్ అవుతావు, తల్లిదండ్రులని మర్చిపోవద్దు అని నాతో చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్లకు, మా నాన్నక్యాన్సర్ బారిన పడ్డారు. ఆపరేషన్‌ కి డబ్బులు అవసరమయ్యాయి. అప్పటికి నేను సినిమాలు చేస్తున్నాను. రెమ్యూనరేషన్ ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి పరిస్థితి వివరించాను. ఎన్టీఆర్ గారు వెంటనే నిర్మాణ సంస్థకు ఫోన్ చేసి, ఆ అమౌంట్ ఇంటికి పంపించేలా చూసారు. ఎన్టీఆర్‌ గారు బోళా శంకరుడు”, “పసిపిల్లల మనస్తత్వం” ఉన్న వ్యక్తి . షూటింగ్‌లలో కూడా  తన పక్కనే కూర్చోమని, తన కారులోనే ప్రయాణించమని చెప్పేవారని చెప్పుకొచ్చాడు.

also read:  Shriya Saran: ఎందుకు ఆ ప్రశ్న వేశారు.. యాంకర్ కి శ్రియా సూపర్ రిప్లై 

భానుచందర్ తండ్రి పేరు మాస్టర్ వేణు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన ట్యూన్స్ ఆయన పేరుపై ఉన్నాయి, ఎన్టీఆర్ నుంచి వచ్చిన అనేక చిత్రాలకి కూడా వేణు గారు ఎన్నో జనరంజకమైన ట్యూన్స్ ని అందించడం జరిగింది.



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com