ఓ మై గాడ్.. స్విమ్‌సూట్‌లో ఉంది భాగ్యశ్రీయేనా?!
on Sep 17, 2021
'ప్రేమ పావురాలు' (మైనే ప్యార్ కియా) అనే డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు భాగ్యశ్రీ. మన ఇంట్లో లేదా పక్కింటి అమ్మాయిలాగా కనిపించిన ఆమె సౌందర్యానికి అందరూ దాసోహమయ్యారు. అప్పట్లో ఆమెను ఆరాధించని కుర్రాళ్లు లేరు అనడంలో అతిశయోక్తి లేదు.
ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే.. 'యువరత్న రాణా' మూవీలో బాలకృష్ణ చెల్లెలిగా, 'ఓంకారం'లో రాజశేఖర్‌తో కలిసి నటించిన భాగ్యశ్రీ అంటే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఏనాడూ హద్దులు దాటకుండా, ఎక్స్‌పోజింగ్‌కు ఏమాత్రం చోటివ్వకుండా సినిమాల్లో నటించారామె. ఇన్నాళ్లకు 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ తల్లిగా మన ముందుకు రాబోతున్నారు.
ప్రస్తుతం భాగ్యశ్రీ వయసు 52 సంవత్సరాలు. తన ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌తో అందరినీ ఆమె ఇన్స్పైర్ చేస్తుంటారు. వయసు పెరిగిందే కానీ, ఆమెలోని సౌందర్యం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఆమె స్విమ్ సూట్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజంగా భాగ్యశ్రీయేనా ఆ ఫొటోలను షేర్ చేసింది అని ఆశ్చర్యపోతున్నారు.
నిన్నటి తరం హిందీ నటి షీబాతో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడిన భాగ్యశ్రీ దానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. స్విమ్‌సూట్‌లో కెమెరాకు నవ్వుతూ పోజులిచ్చారు. డార్క్ బ్లూ కలర్ మోనోకిని డ్రస్‌లో ఉన్న ఆమెను చూడ్డానికి రెండు కళ్లూ చాలవనిపిస్తోంది. ఆ జలకాలాటను ఆమె ఎంతగా ఎంజాయ్ చేసిందో ఆ ఫొటోలే నిదర్శనం.