Home

»

Latest News

అప్పుకి బదులు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయ్.. కూతురి నిర్ణయం ఏంటి!

Mar 09, 2026

 

  
-కంటతడి పెట్టించే కథ
-జీవితాన్ని త్యాగం చేసిన సత్యవతి 
-సమాజానికి సవాల్

మనిషి తల రాత దేవుడు రాస్తాడని అంటారు. ఇది నిజమేనేమో అనే విధంగా ఊహించని మార్పులు మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆనందంగా మార్పుని స్వీకరించాల్సి రావడంతో అప్పటి వరకు మనం కన్న కలలు కలలుగానే ఉండిపోతాయి. మనల్ని నమ్ముకున్న వారు సంతోషంగా ఉంటే చాలని కోరుకుంటాం. అలాంటి వాళ్ళల్లో సత్యవతి ఒకటి. తండ్రి పరువు కోసం, తన జీవితాన్నే పణంగా పెట్టిన మహా వనిత ఈ సత్యవతి. పూర్తి కథ చూద్దాం.
 
 సత్యవతి తండ్రి పేరు మాధవయ్య. అంతంత బతుకులే కావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. ఆత్మభిమానం కలవాడు కావడంతో  తన పరువు బజారున పడుతుందేమోనని ఆవేదన చెందుతుంటాడు. దీంతో సత్యవతి.తన తండ్రిని రుణవిముక్తుడిని చేయడానికి, తన ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా సింగరాజు ని  వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. కొడుకైనా కూతురైనా నేనే అనేవాడివి కదా! నీకు కొడుకే ఉంటే బాకీ తీర్చవలసిన బాధ్యత తను తీసుకోడా?" అని తండ్రితో అంటుంది. ఆ దృశ్యాన్ని లైవ్ లో చూస్తే మన హృదయాలు చలించిపోతాయి. ఒక పేద తండ్రి తన బిడ్డకి  ఇచ్చే అత్యంత విలువైన కానుక 'పసుపు కుంకుమలు' మాత్రమేనని మాధవయ్య పలికే మాటలు పేదరికంలోని గొప్పతనాన్ని చూడవచ్చు.


కానీ మూడు ముళ్ళు పడ్డ ముచ్చట మూడు నాళ్ళైనా గడవకముందే సత్యవతి పెళ్లి జరిగిన కొన్ని రోజులకే  విధి ఆమెని వెక్కిరిస్తుంది. భర్త గుండెపోటుతో కన్నుమూశాడు. రెండు వారాల పాటు మంచం పక్కనే ఉండి సేవ చేసినా, భగవంతుడు ఆమెకి  కన్నీటిని మిగిల్చి ఆమె కుంకుమని  చెరిపేశాడు. తెల్లారిన తన బతుకులో కేవలం తెల్లచీర మాత్రమే మిగిలిందని ఆవేదన చెందుతు తన ఊరికి తిరిగి వస్తుంది. దేవుడు లేని గుడిలా అనిపిస్తున్నావు అని ఆమె స్నేహితురాలు లక్ష్మి బాధపడుతుంది. రంగడు కూడా ఎంతగానో బాధపడతాడు. రంగడు , లక్ష్మి, సత్యవతి చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు. 


 ఆ తర్వాత భర్తని కోల్పోయిన వాళ్ళని 'ముండమోపి', 'విధవ' అని పిలుస్తూ  శుభకార్యాలకి  దూరంగా ఉండాలనే మూఢనమ్మకాలని సత్యవతి సవాల్ చేస్తుంది. అర్థం లేని బంధాలని  తెంచుకోగలిగితే, దేవుడు రాసిన రాతలను కూడా మార్చవచ్చనే విషయాన్నీ చాలా గట్టిగా నమ్ముతుంది. దీంతో తన జీవితం అంధకారమైనా ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్న రంగడు, లక్ష్మిల ప్రేమను గెలిపించాలని  నిశ్చయించుకుంటుంది. సమాజం  అపశకునంగా భావించి దూషించినా వెనకడుగు వెయ్యదు. 

also read: irugapatru.. 38 జంటల విడాకుల్ని ఆపిన మూవీ.. మీకు శతకోటి వందనాలు 

ఈ విధంగా సత్యవతి కథ ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. విధి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మనిషి తన సంకల్పంతో ఎదుటివారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని నిరూపిస్తుంది. త్యాగం అంటే కోల్పోవడం మాత్రమే కాదు. ఇతరుల ఆనందంలో తన సంతోషాన్ని వెతుక్కోవడం కూడా అని ఈ గాథ చాటిచెబుతుంది. ఈ అపురూప సన్నివేశం జానకి రాముడు సినిమాలోది. సత్యవతిగా జీవిత, లక్ష్మి గా విజయశాంతి, రంగడు గా నాగార్జున తమ క్యారెక్టర్స్ కి జీవాన్ని పోశారు. లక్షి తండ్రిగా సాక్షి రంగారావు కనిపించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం, మురారి నిర్మాణపు విలువలకి ఒక విలువ ఉండేలా కూడా జానకి రాముడు చేసింది. మరిన్ని ఆసక్తికరమైన మరియు భావోద్వేగభరితమైన సినిమా సన్నివేశాల కోసం మా తెలుగు వన్(telugu One) ఛానల్ ని  సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

 


  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com