షాద్‌నగర్ నుంచి తిరుమలకి బండ్ల గణేష్ మహా పాదయాత్ర.. హీరో ఫాన్స్ ఏమంటున్నారు
on Jan 10, 2026

-రియల్ హీరో అనిపించుకుంటున్న బండ్ల గణేష్
-షాద్ నగర్ to తిరుమల పాదయాత్ర ఎవరి కోసం
-ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి!
-ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి!
బండ్ల గణేష్ కి తెలుగు సినిమాకి మధ్య ఉన్న అనుబంధం మూడు దశాబ్దాలు.ఈ మూడు దశాబ్దాలలో నటుడు స్థాయి నుంచి బడా నిర్మాతగా ఎదిగాడు. ఈ ప్రస్థానంలో తనకంటు ప్రత్యేకంగా అభిమానులని కూడా సంపాదించుకున్నాడని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రీసెంట్ గా బండ్ల గణేష్(Bandla Ganesh)మహా పాదయాత్రకి శ్రీకారం చుట్టాడు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)గారిని స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరు చెప్పి అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో ఉంచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నుంచి నిర్దోషిగా విడుదల అవ్వాలని, ఆ విధంగా జరిగితే తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి(TTd)కొండకి షాద్ నగర్ లో ఉన్న తన స్వగృహం నుంచి నడిచి వస్తానని మొక్కుకున్నాడు. తన కోరిక నెరవేరడంతో వేంకటేశ్వరుడికి ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం నుంచి మహా పాదయాత్ర ప్రారంభించనున్నాడు. ఈ మేరకు భారీ ఎత్తున ఒక కార్యక్రమం నిర్వహించి పాదయాత్రకి శ్రీకారం చుట్టనున్నాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇచ్చిన మాట నిలబెట్టుకొని బండ్ల గణేష్ హీరో అయ్యాడని ఫ్యాన్స్ అంటున్నారు.
Also read: షాద్‌నగర్ నుంచి తిరుమలకి బండ్ల గణేష్ మహా పాదయాత్ర.. హీరో ఫాన్స్ ఏమంటున్నారు
ఇక ఇప్పటి వరకు పరమేశ్వర ఆర్ట్స్ పై అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ ఇటీవల బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్ అనే బ్యానర్ ని స్థాపించాడు. సదరు బ్యానర్ ద్వారా కొత్త హీరోలతో,కొత్త దర్శకులతో సినిమాలని నిర్మించనున్నాడు.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



