Home

»

Latest News

Bandla Ganesh: పవన్ కి షాక్ ఇచ్చిన బండ్ల గణేష్..ఆ హీరోతో చివరి సినిమా  

May 26, 2026 11:11AM

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ మధ్య ఉన్న రిలేషన్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరకీ ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. ఆ అభిమానం యొక్క స్వరూపం ఎలా ఉంటుందో రీసెంట్ గా చిరంజీవి కొత్త సినిమా మెగా 158 ఓపెనింగ్ రోజు చూసాం. ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియో సోషల్ మీడియాని షేక్ చేసింది. దీంతో ఆ ఇద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుండని అభిమానులు భావిస్తున్నారు. 

ఈ క్రమంలోనే బండ్ల గణేష్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేయడం తన జీవితంలోని ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి . పవన్ ని నేను  కేవలం హీరోగా కాకుండా, ఒక ఆరాధ్య వ్యక్తిగా చూస్తాను. త్వరలోనే నా 'పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌లో పవన్ తో ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తాను. ఆ సినిమా పూర్తయిన తర్వాత నిర్మాణ సంస్థని  శాశ్వతంగా మూసివేస్తాను. పవన్ సినిమాతోనే నిర్మాతగా నాకు అత్యున్నత గుర్తింపు వచ్చింది. మళ్లీ అదే వ్యక్తితో సినిమా చేసి నా సినీ ప్రయాణానికి ఘనమైన ముగింపు ఇవ్వాలని అనుకుంటున్నాను” అని బండ్ల గణేష్ భావోద్వేగంగా తెలిపారు.


Also read: Meenakshi seshadri: చిరంజీవి హీరోయిన్ మీనాక్షిశేషాద్రి ఎమోషనల్ వీడియో.. అసలేం జరుగుతుంది


ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుస ప్లాప్స్ తో ఉన్న  పవన్ కళ్యాణ్ కి  బండ్ల గణేష్ 'గబ్బర్ సింగ్' తో సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు. ఆ చిత్రం టాలీవుడ్ చరిత్రలోనే 100 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరి అప్పట్లో ఒక సంచలనాత్మక రికార్డు సృష్టించింది. హైదరాబాద్ నగరంలో మూడు ఏరియాల్లో డబుల్ థియేటర్స్ లో 50 రోజులు ఆడిన చిత్రంగా ఆడటం నేటికీ ఒక రికార్డు. ఆ ఇద్దరి కాంబోలో వచ్చిన తీన్ మార్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దాంతో గణేష్ కి హిట్ ఇవ్వాలని పవన్ గబ్బర్ సింగ్ ని ఇచ్చాడు. మరి ఇప్పుడు గణేష్ తీసుకున్న నిర్ణయం పవన్ కి షాక్ ఇస్తుందని చెప్పవచ్చు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com