
ఎవరి కాంబో కోసమైతే అభిమానులు, ప్రేక్షకులు సుదీర్ఘ కాలం నుంచి తమ కలలతో కుస్తీ పడుతూ వస్తున్నారో ఆ కాంబో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, కొరటాల శివ కాంబో. దీంతో ప్రతి అప్ డేట్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాపై ఒక లుక్ వేసే ఉంచుతున్నారు. ఈ క్రమంలో తాజా న్యూస్ ఒకటి నిజమైతే బాగానే ఉంటుంది భయ్యా అనేలా చేస్తుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
విద్యాబాలన్.. గతంలో నందమూరి తారక రామారావు గారి బయోపిక్ 'ఎన్టీఆర్: కథానాయకుడు' మహానాయకుడు' చిత్రాల్లో బాలకృష్ణ సరసన బసవతారకమ్మ క్యారక్టర్ లో చేసి మెప్పించింది. బాలయ్య, విద్యాబాలన్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి కొరటాల శివ ఈ క్రేజీ జోడీని వెండితెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సామాజిక అంశాల నేపథ్యంలో సాగే కథలో ఆమె రోల్ ఎమోషనల్ మరియు ఇంటెలిజెంట్ నోట్‌లో ఉంటుందని టాక్. ఇప్పటికే చిత్ర బృందం ఆమెను సంప్రదించిందని, కథాంశం నచ్చడంతో ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లుగ కూడా చెప్తున్నారు. మరి విద్యాబాలన్ ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అంచనాలు జాతీయ స్థాయిలో పెరగడం ఖాయం. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు వేచి చూడాల్సిందే!
Also read: పనిమనిషి లైంగిక వేధింపులు.. రెండో ఫ్లోర్ నుంచి కిందకి దూకేసిన ప్రముఖ నటి
జూన్ చివరి వారం లేదా జూలైలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాలయ్య ప్రెజెంట్ గోపిచంద్ మలినేని మూవీలో చేస్తున్న విషయం తెలిసిందే.







