కొవిడ్‌తో మా ఫ్యామిలీ సఫర్ అయినట్లు ఇతర ఫ్యామిలీస్ కాకూడదు!
on Apr 29, 2021
'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ అవికా గోర్ ఏ విషయంపైనైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంటుంది. జీవితంపైనా, తను సినిమాల్లో చేసిన పాత్రలపైనా కూడా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటుంది. లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆమె షేర్ చేసిన పోస్ట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అందులో ఆమె తన బ్యూటిఫుల్ పిక్చర్‌ను పోస్ట్ చేసింది. ఆమె ధరించిన వైట్ డ్రస్ గాల్లో ఎగురుతోంది. అయితే మనం చూడాల్సింది ఆ పిక్చర్‌ను కాదు, దానితో పాటు ఆమె షేర్ చేసిన నోట్‌ను. మామూలుగా అయితే దాన్ని పూర్తిగా చదవరనే ఉద్దేశంతో అందరి దృష్టీ దానిమీద పడాలనే ఉద్దేశంతో ఆ ఫొటోను షేర్ చేసిందన్న మాట.
"ఇప్పుడు నేను మీ అందరి అటెన్షన్ పొందుతున్నా. ఇప్పుడు అవసరమైన విషయాలు మాట్లాడుకుందాం. బయట చాలా భయానకంగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 2 లక్షల మంది తమ జీవితాల్ని కోల్పోయారు. అసలు లెక్కలు దానికి 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటాయని మనందరికీ తెలుసు." అంటూ ఆమె రాసుకొచ్చింది. ఇప్పటిదాకా ఇండియాలో వైరస్ వల్ల 17 మిలియన్ల మంది అధికారికంగా ప్రభావితులయ్యారనీ, వాళ్లంతా సమీప భవిష్యత్తులో ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడనున్నారనీ ఆమె చెప్పింది.
తన ఫ్యామిలీ మొత్తం కొవిడ్ 19 చాలెంజ్‌ను ఎదుర్కొందనీ, అది ఏమాత్రం ఆహ్లాదకర అనుభవం కాదనీ అవిక వెల్లడించింది. అది భయానక అనుభవమనీ, వాళ్లంతా బతికి బట్టకట్టడం ఆనందకరంగా ఉందనీ చెప్పిన ఆమె, అలాంటి బాధలను ఇతర కుటుంబాల వారెవరూ పడకూడదని కోరుకుంటున్నానని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మాను దానం చేయాలని కోరిన ఆమె, ఎప్పుడు అవకాశం లభిస్తే అప్పుడు వాక్సిన్ వేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది. ఎప్పుడూ మాస్క్ ధరించాలని ప్రజలకు గుర్తుచేస్తూ తన సుదీర్ఘ పోస్టును ముగించింది అవిక.
Also Read