
బిగ్ బాస్ ఫేమ్, సోషల్ మీడియా సెన్సేషన్ అషురెడ్డి (Ashu Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక వ్యక్తి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తోందంటూ ఆమెపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఈ ఆరోపణలు సంచలనంగా మారడంతో అషురెడ్డి కూడా ఘాటుగా స్పందించారు.
అసలేం జరిగింది?
హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌కు చెందిన యెనుముల సత్యనారాయణ అనే వ్యక్తి తన కుమారుడు ధర్మేంద్రను అషురెడ్డి మోసం చేసిందని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018లో లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్రకు అషురెడ్డి పరిచయమయ్యారు. ప్రేమ, పెళ్లి పేరుతో ధర్మేంద్ర నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 9.35 కోట్ల విలువైన నగదు, బంగారం, ఫ్లాట్లు, లగ్జరీ వాహనాలను అషురెడ్డి తన పేరిట తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అషురెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో ధర్మేంద్రను నమ్మించారని, పెళ్లి ప్రస్తావన వస్తే ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అషురెడ్డి ఘాటు స్పందన
తనపై వస్తున్న ఈ భారీ ఆరోపణలపై అషురెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక హెచ్చరిక జారీ చేశారు. "నా ప్రమేయం లేకుండా, నా అనుమతి లేకుండా నా గురించి ఏ వార్త రాసినా లేదా తప్పుడు ప్రచారం చేసినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను." అని రాసుకొచ్చారు.
గతంలో కూడా అషురెడ్డి పేరు కొన్ని వివాదాల్లో వినిపించినప్పటికీ, ఏకంగా రూ. 9 కోట్లకు పైగా మోసం జరిగిందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే, అషురెడ్డి మాత్రం ఈ ప్రచారమంతా అబద్ధమని కొట్టిపారేస్తున్నారు.






