సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతున్న తండ్రీకూతుళ్లు!
on Feb 7, 2026
యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోగా ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. హీరోగానే కాదు, డైరెక్టర్‌గా కూడా తనేమిటో ప్రూవ్ చేసుకొని అద్భుతమైన సినిమాలను రూపొందించారు. డైరెక్టర్‌గా అర్జున్‌కి మంచి పేరు తెచ్చిన సినిమా జైహింద్. ఆ తర్వాత కూడా చాలా సినిమాలను డైరెక్ట్ చేశారు. చివరగా తమిళ, కన్నడ భాషల్లో కుమార్తె ఐశ్వర్యతో ఓ సినిమా చేశారు. చాలా గ్యాప్ తర్వాత ఇప్ప్పుడు తెలుగులో ఐశ్వర్య హీరోయిన్‌గా ‘సీతాపయనం’ పేరుతో ఓ విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
నిరంజన్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేమ, కుటుంబ విలువల నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున ఈ సినిమా విడుదల కాబోతోంది. 1992లో ‘సేవగన్’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన అర్జున్ తొలిసారి తెలుగులో దర్శకత్వం వహించిన సినిమా ‘సీతాపయనం’. ఇక ఐశ్వర్యా అర్జున్ విషయానికి వస్తే.. 2013లో విశాల్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘పట్టతు యానై’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యారు. 2018లో అర్జున్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ‘సొల్లివిదవ’, కన్నడ సినిమా ‘ప్రేమ బరహా’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ఇప్ప్పుడు తండ్రి దర్శకత్వంలోనే రూపొందిన ‘సీతాపయనం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవు తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



