ఆ విషయంలో వారినే ఫాలో అవుతూ ఫ్యాన్స్‌ని హర్ట్ చేస్తున్న అనుష్క!
on Jul 5, 2025
ఇటీవలికాలంలో పెద్ద సినిమాలన్నీ రిలీజ్‌ల విషయంలో తర్జనభర్జనలు పడుతున్నాయి. ఏ ఒక్కటీ చెప్పిన డేట్‌కి రిలీజ్ అవ్వడం లేదు. ఒకసారి కాదు పలుమార్లు తమ సినిమాల రిలీజ్‌లను వాయిదా వేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పుడు అదే దారిలో అనుష్క తాజా చిత్రం ‘ఘాటి’ కూడా వెళుతోంది. యువి క్రియేషన్స్ బేనర్‌లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను జూలై 11న విడుదల చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చెయ్యలేదు. దాన్ని బట్టే రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని అంతా భావించారు. అనుకున్నట్టుగానే యువి క్రియేషన్స్ సంస్థ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉందట. అందుకే రిలీజ్‌ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈమధ్యకాలంలో ఎక్కువ వాయిదాలు పడిన సినిమాల్లో హరిహర వీరమల్లు మొదటి స్థానంలో నిలుస్తుంది. టోటల్‌గా 14 సార్లు ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. ఫైనల్‌గా జూలై 24న రిలీజ్ అవుతోంది. విజయ్ దేవరకొండ సినిమా కింగ్‌డమ్ రిలీజ్‌ను కూడా చాలా సార్లు వాయిదా వేశారు. ఇటీవల విడుదలైన కన్నప్ప చిత్రాన్ని కూడా కూడా చెప్పిన డేట్‌కి రిలీజ్ చెయ్యలేకపోయారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా విశ్వంభర కూడా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంలో క్లారిటీ లేదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
