మరో ఐటమ్ సాంగ్ లో పూజా హెగ్డే!?
on Feb 8, 2022
దాదాపు నాలుగేళ్ళ క్రితం విడుదలైన `రంగస్థలం` చిత్రం కోసం ``జిల్ జిల్ జిగేల్ రాణి`` అంటూ సాగే ఐటమ్ సాంగ్ లో తన చిందులతో కనువిందు చేసింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. అంతేకాదు.. ఆ పాట పుణ్యమా అని కెరీర్ లో తొలి సక్సెస్ చూసింది కూడా. ఆపై కథానాయికగా వరుస విజయాలతో దూసుకుపోయాక.. మళ్ళీ స్పెషల్ డాన్స్ నంబర్స్ జోలికి వెళ్ళనేలేదు పూజా హెగ్డే. కట్ చేస్తే.. త్వరలో మరో ఐటమ్ సాంగ్ లో నర్తించబోతోందట ఈ అందాల `అరవింద`. కాకపోతే.. ఈ సారి తెలుగు సినిమా కోసం కాదు, ఓ బాలీవుడ్ మూవీ కోసం పూజ తన స్టెప్స్ తో అదరగొట్టబోతోందట.
Also Read: సామ్ తో హ్యాట్రిక్.. మరి పూజ సంగతేంటో!?
ఆ వివరాల్లోకి వెళితే.. `అర్జున్ రెడ్డి`, `కబీర్ సింగ్` వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పొందుతున్న చిత్రం `యానిమల్`. రణ్ బీర్ కపూర్, పరిణీతి చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్ ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు. మనిషి జంతువులా ప్రవర్తిస్తే ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయి? అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా, ఈ సినిమా కోసమే పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయనుందట. పాట కాన్సెప్ట్, పారితోషికం బాగుండడంతో పూజ కూడా ఈ ప్రత్యేక గీతంపై ఆసక్తి చూపిస్తోందట. త్వరలోనే `యానిమల్`లో పూజ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
Also Read: జగన్, చిరంజీవి భేటీపై మంచు విష్ణు కామెంట్స్!
కాగా, పూజా హెగ్డే తాజా చిత్రం `రాధే శ్యామ్` మార్చి 11న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు ఓ కీలక పాత్రలో నటించిన `ఆచార్య` కూడా ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service




