Home

»

Latest News

Ananya Nagalla: ఇది అలాంటి కంటెంట్ కాదు.. ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ పై అనన్య నాగళ్ళ క్లారిటీ!

Apr 19, 2026

ఇటీవల కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్ లోని సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ద్వారా 390 రూపాయలకి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ అంటూ మొదలు పెట్టడం చూస్తున్నాం. అయితే ఇది వివాదానికి దారితీస్తోంది. ముఖ్యంగా ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya) విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సబ్‌స్క్రిప్షన్ పేరుతో అసభ్యకర ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ యువతను చెడగొడుతుంది అంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ (Ananya Nagalla) ఇన్‌స్టాగ్రామ్ లో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అనన్య నాగళ్ళ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ లో అనన్య సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ చూసి చాలామంది పలువురు ఆశ్చర్యపోయారు. తను కూడా బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేసి, డబ్బులు సంపాదిస్తుందా అనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ అంశంపై తాజాగా అనన్య క్లారిటీ ఇచ్చింది. 

నిజానికి అనన్య నాగళ్ళ కొత్తగా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టలేదు. న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కు ఏడాది క్రితమే సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఉంది. అంతేకాదు అసలు ఈ సబ్‌స్క్రిప్షన్ పెట్టడానికి గల కారణాన్ని తెలుపుతూ ఆమె గతేడాది ఏప్రిల్ లోనే ఒక వీడియో పోస్ట్ చేసింది. తాజాగా ఆ వీడియో మరోసారి షేర్ చేసింది అనన్య.

"నేను నా అభిమానులకు, ప్రజలకు దగ్గర కావడం కోసం మాత్రమే నేను ఈ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఎంచుకున్నాను. తద్వారా నా జీవితంలో నాకు జరిగినవి, జరుగుతున్నవి ప్రజలకు తెలియజేసి నాకు తోచిన విధంగా అందరికీ సహాయపడాలనే సదుద్దేశంతోనే నేను సబ్‌స్క్రిప్షన్  ఎంచుకున్నాను." అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, అదే వీడియోలో తన భక్తిని కూడా చూపించింది. "21 రోజుల పాటు రోజుకు 108 సార్లు 'ఓం నమః శివాయ'  అనుకుంటూ జపం చేయడం ద్వారా మనశ్శాంతిగా ఉంటుంది" అని ఆమె వీడియోలో తెలపడం జరిగింది. 

మొత్తానికి కొందరిలా సబ్‌స్క్రిప్షన్ పేరుతో బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేసి డబ్బు సంపాదించే ఉద్దేశం తనకు లేదని అనన్య నాగళ్ళ చెప్పకనే చెప్పేసింది. పైగా తను మంచి విషయాలను పంచుకోవడం  కోసం ఎప్పుడో ఆ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ను మొదలుపెట్టడం విశేషం.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com