Home

»

Latest News

అసెంబ్లీలోకి వెళ్లి సీఎంకే వార్నింగ్ ఇచ్చిన రైతు!

Apr 01, 2026

ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి అసెంబ్లీలో, సామాన్యుడి గొంతు వినిపించడం ఒక అరుదైన దృశ్యం. కానీ, తన భూమిని, భవిష్యత్తును నమ్ముకున్న ఒక రైతు, పాలకుల కళ్ళు తెరిపించడానికి ఆ గడప తొక్కితే.. అది కేవలం ఒక నిరసన కాదు, నేల తల్లి పడుతున్న ఘోష. 

ఓ వైపు అభివృద్ధి ఆశలు, మరోవైపు పాలకుల అహంకారం మధ్య నలిగిపోతున్న అమరావతి రైతుల ఆవేదనను కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా 'అమరావతి ఫైల్స్'(Amaravati Files). విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ సినిమాలో ఎన్నో గొప్ప సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక రైతుబిడ్డ అసెంబ్లీ సాక్షిగా సీఎంను నిలదీసే సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలిచింది.

నిస్వార్థ త్యాగం - అధికార దాహం:
రాజధాని నిర్మాణం కోసం తమ పచ్చని పొలాలను త్యాగం చేసిన రైతులది ఎంత గొప్ప సంస్కారం? కానీ, అధికారంలోకి రాగానే మాట మార్చి, రాజధానిని ఒక ఆట వస్తువుగా మార్చడం ఎంతటి ద్రోహం? ఒక ప్రభుత్వం ఒక పథకం పెడితే, మరో ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేయడం సహజమేమో కానీ, రాజధాని కూడా ఒక పథకం లాంటిదేనా? అని ఆ రైతు వేసిన ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. 130 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒకే రాజధాని ఉన్నప్పుడు, కేవలం 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా? ఇది ప్రజల ప్రయోజనం కోసమా లేక వ్యక్తిగత ద్వేషమా? అంటూ రైతు నిలదీసే తీరు అద్భుతం.

దిగజారుతున్న రాజకీయ విలువలు:
ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన అన్నపూర్ణ మన ఆంధ్రప్రదేశ్. కానీ నేడు, 'భవతి భిక్షాందేహి' అన్నట్లుగా అప్పుల కోసం అందరినీ అర్ధించే స్థాయికి దిగజారిపోయింది.. అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు వాడే భాష, ప్రవర్తించే తీరు చూస్తుంటే, ఆ వ్యవస్థ ఎంత అపవిత్రమైందో అర్థమవుతోంది.. భరతుడు రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి ప్రజల కోసం పాలన సాగించిన ఈ దేశంలో, నేడు పదవులే ముఖ్యం, అహంకారమే లక్ష్యం అనుకునే పాలకులు పుట్టడం దురదృష్టకరం అని అసెంబ్లీలో రైతు గర్జించాడు.

అణచివేత, కన్నీటి గాథ:
ప్రజల గొంతును అసెంబ్లీ లోపల వినిపించకుండా లైవ్ కట్ చేయడం, ప్రజా పోరాటాలను కొందరి సమస్యగా చిత్రీకరించడం ఏ రకమైన న్యాయం?. అమరావతి ముట్టడికి వెళ్లి తిరిగి వస్తూ, విషాహారం వల్ల 70 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం గుండెలను పిండేసే సంఘటన.. ఈ మరణాల వెనుక ఉన్న కుట్రలు, పోస్ట్‌మార్టం రిపోర్టులను మార్చగలిగే అధికారం.. ఇవన్నీ చూస్తుంటే సామాన్యుడి ప్రాణాలకు విలువ లేకుండా పోయిందనిపిస్తుంది.. మన ఆదాయం ఇతర రాష్ట్రాలకు టాక్స్ రూపంలో పోతుంటే, మన యువత ఉపాధి కోసం వలసలు వెళ్తుంటే, రాజధాని లేని రాష్ట్ర ఉనికి ఎక్కడుంటుంది? అని రైతు ప్రశ్నించే తీరు కట్టిపడేసింది.

రాజధాని అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ కట్టడం కాదు.. అది ఒక రాష్ట్ర ఆత్మగౌరవం, లక్షలాది మంది రైతుల నమ్మకం. ప్రజల కన్నీళ్లు చూసిన వాడికి ప్రభుత్వ లాఠీ దెబ్బలు, బుల్లెట్లు భయం కలిగించవు.. సమస్యకు పరిష్కారం దొరికే వరకు, నేల తల్లి సాక్షిగా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.. ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది, కానీ ఆ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని రాజధాని విలువని రైతు చెప్పడం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.

'అమరావతి ఫైల్స్' ఫుల్ మూవీ కోసం, ఇలాంటి అద్భుతమైన సన్నివేశాల కోసం మా తెలుగువన్(TeluguOne) యూట్యూబ్ ఛానల్‌ని సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com