
టాలీవుడ్‌లో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ 'అమరావతికి ఆహ్వానం'(Amaravathiki Aahwanam). శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తర్ నొరోన్హా, సుప్రీత ప్రధాన పాత్రలు పోషించారు. జీవీకే దర్శకత్వంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెట్టింది. థియేటర్లలో పరవాలేదు అనిపించుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
'అమరావతికి ఆహ్వానం' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' సొంతం చేసుకుంది. మార్చి 20 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. థియేటర్ రిలీజ్ అయిన ఐదు వారాలకే ఓటీటీలోకి రావడంతో హారర్ ప్రియులు ఖుషీ అవుతున్నారు.
కథ ఏంటంటే..
ఈశ్వర్(శివ కంఠమనేని) సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్. భార్య భాను(ధన్య బాలకృష్ణ), ఇద్దరు మరదళ్ళతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తుంటాడు. మరదలు భార్గవి(సుప్రీత) ఓ యూట్యూబర్. సిటీలోని భూత్ బంగ్లాలలో ఒకరోజు గడిపి అక్కడ దెయ్యం లేదని రుజువు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంది. ఒకసారి ఓ అజ్ఞాత వ్యక్తి భార్గవికి ఫోన్ చేసి.. అమరావతి అనే ఊరిలో నిజంగా దెయ్యాలు ఉన్నాయంటూ అక్కడికి ఆహ్వానిస్తాడు. ఇదొక ట్రిప్ లా ఉంటుందని భార్గవితో పాటు ఫ్యామిలీ అంతా వెళ్ళడానికి రెడీ అవుతారు. ఈశ్వర్ కి ఇష్టం లేకపోయినా.. భార్య కోసం బయల్దేరతాడు. అమరావతిలో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? అక్కడ ఈశ్వర్ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడికి వెళ్ళాక తెలిసిన రహస్యం ఏంటి? ఇందులో రాజేశ్వరి(ఎస్తర్ నొరోన్హా) పాత్ర ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన తర్వాత 'అమరావతికి ఆహ్వానం' సినిమాకు మంచి స్పందనే లభిస్తోంది. హారర్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా దర్శకుడు జీవీకే ఈ కథను రూపొందించడం ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. అయితే, కొన్ని సీన్స్ పాత హారర్ సినిమాలను గుర్తుకు తెస్తున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది.
హారర్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండటంతో ఈ వీకెండ్ ఓటీటీ ఆడియన్స్ కి 'అమరావతికి ఆహ్వానం' ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
Also Read: అమరావతికి ఆహ్వానం మూవీ రివ్యూ






