Home

»

Latest News

Allu arjun: అల్లు అర్జున్ కోర్టు విచారణ తాజా అప్‌డేట్ ఇదే! 

Jul 6, 2026 1:07PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  'పుష్ప 2 ది రూల్' ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్‌లో జరిగిన ఘోర తొక్కిసలాట ఉదంతం టాలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనకి  సంబంధించిన కేసు విచారణ  నాంపల్లి కోర్టులో కీలక దశకు చేరుకుంది.గత వాయిదా సమయంలో అల్లు అర్జున్ తరఫు న్యాయవాది కోర్టులో ఒక ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. బన్నీ ప్రస్తుతం తన తదుపరి సినిమాల షూటింగ్‌ల నిమిత్తం ముంబైలో ఉన్నారని, అందుకే వ్యక్తిగతంగా హాజరుకాలేని పరిస్థితి ఉందని కోర్టుకు వివరించారు. ఆడియో-వీడియో ఎలక్ట్రానిక్ విధానం ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో, న్యాయస్థానం అందుకు అంగీకరించింది. దీంతో అల్లు అర్జున్ ముంబై నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు.

నిందితుల కొంత మంది వ్యక్తిగత కారణాలతో విచారణకి  హాజరు కాకపోవడంతో కోర్టు  తదుపరి విచారణ 29 కి వాయిదా వేసింది.  23 మంది నిందితులకి  500 పేజీల ఛార్జ్ షీట్ కాపీలని పీపీ అందించాడు. దీంతో 29 న వచ్చే తీరుపై అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది. 

Also read: Nagarjuna: నిర్మాతగా నాగార్జున అందుకున్న హిట్, ప్లాప్స్ ఇవే 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com