
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం AA23 గురించి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా గ్రాండ్ లాంచ్ ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
పుష్ప 2 సిరీస్ సృష్టించిన సంచలనం తర్వాత, అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్టులతో పాన్ ఇండియా మార్కెట్‌ని మరింత షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా 'రాకా' చేస్తున్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది.
ఈ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ మూవీ లాంచ్ నవంబర్ నెలలో చాలా గ్రాండ్‌గా జరగనుందని సమాచారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
లోకేష్ కనగరాజ్ మార్క్ డార్క్ అండ్ రా యాక్షన్ మేకింగ్, దానికి తోడు అల్లు అర్జున్ అసాధారణమైన స్క్రీన్ ప్రెజెన్స్. వీరిద్దరి కాంబోకి రోక్‌స్టార్ అనిరుధ్ ఇచ్చే ఎనర్జెటిక్ మ్యూజిక్ యాడ్ అయితే థియేటర్లలో రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం అల్లు అర్జున్ 'రాకా' ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసుకొని, ఆ వెంటనే లోకేష్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నారు.
Allu Arjun, Lokesh Kanagaraj, AA23 Launch





