Home

»

Latest News

ఆ పని కంటే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చోండి.. అల్లు అర్జున్ వ్యాఖ్యలు వైరల్  

Jul 28, 2026 5:42PM

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ఈ రోజు హైదరాబాద్‌లోని ఒక ప్రవైట్ హోటల్ లో  ‘అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్’ (AAFA) ఆధ్వర్యంలో గ్రాండ్ ఫ్యాన్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 600 మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. 

ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతు నా అభిమానులకి మాత్రమే కాదు. నన్ను ద్వేషించే వాళ్లకి  కూడా ఒక  విషయం ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్నాను. ఒకరిపై విమర్శలు చేయడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. మనకు నచ్చని వాళ్ల కోసం మన డబ్బును ఖర్చు పెడతామా? లేదు కదా. అలాగే మనకు నచ్చని వాళ్ల కోసం మన సమయం, డబ్బు, శక్తి ఎందుకు ఖర్చు చేయాలి? సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్‌పై స్పందించడం కంటే ఆ టైంని మీ ఎదుగుదల కోసం ఉపయోగించండి. ఆ సమయంలో మీకు నచ్చిన పని చేయండి. లేకపోతే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చున్నా పర్లేదు .కనీసం ఆ సమయాన్ని అయినా మీరు ఆస్వాదిస్తారు కదా. మీకు నచ్చని వాళ్ళని  ట్రోల్ చేయకండి, వదిలేయండి.  టైమ్‌, ఎనర్జీ ఏదైనా ప్రతి మనిషికి ఒక రోజులో వంద శాతం ఉంటే దాన్ని మీరు దేనికి వాడతారు అనేదే ముఖ్యం.

Also read: ఇక టికెట్ రేట్ల పెంపుకి చెక్.. ఆ మూడు సినిమాలతో గుట్టు రట్టు! 

నాపై ఎంతో ప్రేమాభిమానాలని చూపిస్తూ, ప్రత్యేకంగా ఆర్గనైజేషన్‌గా ఏర్పడి మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట నా  మనసులోంచి నేరుగా వస్తుంది. "కీప్ ది ఫైర్ ఆన్" అని చెబుతూ ఫ్యాన్స్ లో   ఎనర్జీని నింపారు.

Allu Arjun, Allu fans

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com