‘రొమాంటిక్’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
on Sep 25, 2021
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌తోపాటు ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆకాశ్ పూరి సరసన నాయికగా కేతికా శర్మ నటిస్తోంది. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, చార్మీలు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రానికి సునీల్ కాశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే పూరీ జగన్నాథ్ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌తో సహా అన్ని పనులు పూర్తి అయినాయని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
అసలయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 18న విడుదల చేయవలసి ఉంది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ చిత్రం విడుదల తేదీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రొమాంటిక్ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాతోనైనా ఫస్ట్ హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు ఆకాశ్ పూరి.
Also Read