Home

»

Latest News

Ajith: తమిళనాడు నో చేంజ్ అని చెప్పిన అజిత్!.. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం 

Apr 24, 2026


ఇందుగలడందులేడని సందేహము వలదు తండ్రి నారాయణుడు అన్ని చోట్ల ఉన్నాడని అన్నట్టుగా ఒక హీరో అంటే గిట్టని మరో హీరో అభిమానులు అన్ని చోట్లా ఉంటారు. తమిళనాడులో అయితే మరి ఎక్కువ. ఎవరి ప్రాపర్టీ ఎవరు లాక్కోకపోయినా ద్వేషం అనేది మాత్రం కామన్. ఈ ప్రాసెస్ లో వాస్తవాన్ని కూడా ఆలోచించలేరు. అలాంటి ఒక వాస్తవాన్ని ఆలోచించకుండానే విజయ్ ఫ్యాన్స్ అజిత్ పై నోరు పారేసుంటున్నారు. దీంతో అజిత్ టీం వివరణ ఇచ్చింది. పూర్తి మ్యాటర్ చూద్దాం.

నిన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో అజిత్(Ajith)తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. అజిత్ ని చుట్టూ ముట్టిన విలేకర్లు'  తమిళనాడులో 'మార్పు తద్యమా' అని అడిగారు. నో నెవర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విజయ్(VIjay)అభిమానులు పలు చోట్ల అజిత్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు . దీంతో పరిస్థితిని గమనించిన అజిత్ మేనేజర్ నో నెవర్ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ అజిత్ గారు  నో నెవర్ అనే ఆన్సర్ ని మార్పు తద్యమా అనే ప్రశ్నకి చెప్పలేదు. వేరే ప్రశ్నకి ఇప్పుడు వద్దు అని వారిస్తూ ఇంగ్లీష్ లో చెప్పాడని తెలియచేసాడు.  దీంతో విజయ్ అభిమానులు  శాంతించారు.

Also read: D4vd: ప్రముఖ సింగర్ డిక్కీలో 14 ఏళ్ల బాలిక శవం.. నాలుగు నెలల పాటు కారులోనే

విజయ్,అజిత్ తమిళ సినీ పరిశ్రమకి రెండు కళ్ళు. ఆ ఇద్దరి మధ్య వృత్తిపరమైన పోటీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతు విజయ్ తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలను నేను గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు. అసలు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి, అజిత్ అభిమానులు కూడా ఆయనకు మద్దతు ఇస్తారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమయ్యాయి. గతంలో విజయ్ రాజకీయ సభల్లో కొందరు అజిత్ అభిమానులు  కనిపించడం ఆ వార్తలకి మరింత బలాన్ని చేకూర్చింది. అయితే  అజిత్ టీమ్ ఆ వార్తలపై స్పందిస్తు  ఏ రాజకీయ పార్టీకి అజిత్ మద్దతు తెలపడం లేదు, అయన పేరు, ఫోటోలని  ఏ రాజకీయ వేదికపై వాడకూడదని ఒక నోట్ రిలీజ్ చేసారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com