
సిల్వర్ స్క్రీన్ పై సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే పేరు పడితే చాలు ఊహించని కథ, కథనంతో కూడిన సూపర్ హిట్ సినిమా చూడబోతున్నామని తన్మయత్వంతో మురిసిపోయేవాళ్లు. హీరోల ఫ్యాన్స్ అయితే తమ హీరో సినిమా కలెక్షన్స్ విషయంలో పోటీపడుతుండే వాళ్ళు. అలాంటి బ్యానర్ అధినేత ఎం.ఎస్. రాజు దర్శకుడిగానూ తన పందా కొనసాగిస్తు ఈ నెల 14న మిస్టరీ హారర్ థ్రిల్లర్ చిత్రం 'అగధ' తో థియేటర్స్ లో ప్రత్యక్షమయ్యారు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'అగధ' మూడు రోజులకి కోటి ముప్పై లక్షలు సాధించట్టుగా ట్రేడ్ వర్గాల రిపోర్ట్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200కి పైగా స్క్రీన్లలో 500 షోలతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఓవర్సీస్‌లోనూ మోక్ష మూవీస్ ద్వారా 60కి పైగా స్క్రీన్లలో విడుదల చేశారు. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 25 వేల నుండి 30 వేల వరకు టికెట్లు అమ్ముడుపోగా, మొదటి రోజు 50 లక్షల రూపాయల కలెక్షన్లు సాధించినట్లు సమాచారం అందుతోంది. అయితే, తొలి వీకెండ్ ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన స్థాయి ఆదరణ పొందలేకపోయింది. ఆడియెన్స్ నుండి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో మూడు రోజుల కలెక్షన్ల బాక్సాఫీస్ గ్రాఫ్ తీవ్ర నిరాశను మిగిల్చింది. ఎం.ఎస్. రాజుగారు వైవిధ్యమైన కాన్సెప్ట్ ఎంచుకున్నప్పటికీ, కమర్షియల్‌గా విజయం సాధించడానికి అవసరమైన బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లని చేరుకోవడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. థియేట్రికల్ రన్‌లో ఈ హారర్ డివైన్ థ్రిల్లర్ ఎంతవరకు నిలదొక్కుకుంటుందో వేచి చూడాలి!
Also read: ఓటిటిని షేక్ చేస్తున్న తెలుగు బోల్డ్ థ్రిల్లర్..ఇండియాలోనే నెంబర్ 1 మూవీగా ట్రెండింగ్ లో
కామాక్షి భాస్కర్ల, శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, వనితా విజయ్ కుమార్ మరియు భానుచందర్ కీలక పాత్రలు పోషించారు. దైవశక్తి, ఆవహించిన మహాదేవికి, అగధ అనే క్షుద్రశక్తికి మధ్య జరిగిన పోరాటమే అగధ మూవీ. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ సినిమాను నిర్మించారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఓన్ రిలీజ్ పద్ధతిలో కమీషన్ బేసిస్‌పై ఆంధ్రా, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో నిర్మాతలే రిలీజ్ చేశారు.

Agadha, MsRaju, kamakshi Bhaskarla




