Home

»

Latest News

VIjay: నటి జూలియా సంచలన వ్యాఖ్యలు.. నా గర్భస్రావానికి విజయ్ కారణం

Jun 1, 2026 11:57AM

 

-నా గర్భస్రావానికి విజయ్ కారణం
-సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ నటి వ్యాఖ్యలు 
-ఆ ఎనిమిది మందిని అదుపులో పెట్టుకోండి


తమిళ బిగ్ బాస్ షో తో పాటు టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా పాపులరైన నటి 'మరియా జూలియానా' అలియాస్ జూలి(JUlie). తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్(VIjay)పై ఎలక్షన్స్ నాటి నుంచే తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తుంది. చెన్నై మెరీనా బీచ్ లో అయితే ఎలాంటి పర్మిషన్ లేకుండా విజయ్ కి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన రికార్డు కూడా జూలీకి ఉంది.


రీసెంట్ గా చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతు 'విజయ్ అభిమానులు  ముఖ్యంగా ఎనిమిది మంది సోషల్ మీడియాలో నాపై దారుణమైన ట్రోలింగ్, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నా భర్తపై కూడా అసభ్యకరమైన కామెంట్లు చేస్తుండటం తీవ్ర మానసిక క్షోభకి  గురి చేస్తుంది. కేవలం రాజకీయ పరమైన భిన్నాభిప్రాయాల వల్లే ఒక మహిళ అని కూడా చూడకుండా నా శీలాన్ని శంకించేలా పోస్టులు చేస్తున్నారు. ఆ తీవ్రమైన మానసిక వేదన భరించలేకే గర్భస్రావానికి గురయ్యాను. ఈ మొత్తం దారుణానికి తమిళనాడు ముఖ్యమంత్రి  విజయ్ అన్నే బాధ్యత వహించాలి.ఈ ఆన్‌లైన్ వేధింపులపై  మార్చి నెలలోనే పోలీసులకి  ఫిర్యాదు చేశాను. అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చర్యలు ఆలస్యమయ్యాయి. అయితే ఆ తర్వాత 8 మంది నిందితులపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా, అది కేవలం సివిల్ డెఫమేషన్  కిందకి  వస్తుందని నోటీసులు ఇచ్చారు. దీని వెనుక రాజకీయ హస్తం ఉంది. తాజా ప్రభుత్వ మార్పుల తర్వాత నిందితులకి  రక్షణ లభిస్తోందనే  అనుమానం వస్తుంది.అంతేకాకుండా నా ప్రతిష్టని  మరింత దిగజార్చడానికి 15 లక్షల రూపాయల కిడ్నీ స్కామ్ ఆరోపణలని సృష్టించారు.


Also read: vignesh shivan: నయనతర భర్త విఘ్నేష్ శివన్ భావోద్వేగ పోస్ట్.. నా కలలన్నీ ముక్కలు  


విజయ్ నేరుగా ఈ పని చేయకపోయినా, తన మద్దతుదారులని, అభిమానులని  కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు. విజయ్ అన్న ఒక్క మాట చెప్పి తన అభిమానులని  వెనక్కి తగ్గమని ఉంటే, ఈ రోజు తనకు ఈ గర్భస్రావం జరిగేది కాదు.  నా బిడ్డ బతికి ఉండేదని భావోద్వేగంతో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు సినీ, పొలిటికల్ వర్గాల్లో వైరల్ గా మారాయి. జూలీకి ఈ ఏడాది జనవరిలో మహ్మద్ ఇక్రీమ్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com