ఓటీటీలోకి 'విక్రమ్'.. స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
on Jun 29, 2022
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'విక్రమ్'. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలించింది. తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది విక్రమ్. ఈ సినిమాతో తిరిగి తన స్టార్ డమ్ ను ప్రూవ్ చేసుకున్నారు కమల్ హాసన్.
సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ..ఈ మూడు పాత్రలను ఏ క్యారెక్టర్ ఎక్కడా తగ్గకుండా పోటాపోటీగా రూపొందించిన విధానం ఆశ్చర్యపరిచింది. ఈ సూపర్ హిట్ మూవీ జూలై 8 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటిన విక్రమ్ ఓటీటీలోనూ అదే స్థాయి రెస్పాన్స్ తెచ్చుకుంటుందేమో చూడాలి.
Also Read