విజయ్ - వంశీ పైడిపల్లి చిత్రానికి ముహూర్తం ఫిక్స్!
on Sep 20, 2021
స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న దర్శకుల్లో వంశీ పైడిపల్లి ఒకరు. ప్రభాస్ తో `మున్నా`, జూనియర్ ఎన్టీఆర్ తో `బృందావనం`, రామ్ చరణ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో `ఎవడు`, నాగార్జునతో `ఊపిరి`, మహేశ్ బాబు తో `మహర్షి`.. ఇలా ఇంతవరకు వంశీ ఫిల్మోగ్రఫీ అంతా టాప్ స్టార్స్ తోనే సాగింది. జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ అన్నట్లు.. ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్స్ తోనే సినిమాలు చేసిన వంశీ పైడిపల్లి.. త్వరలో కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ తో సినిమా చేయబోతున్నాడు.
షరా మాములుగానే వంశీ పైడిపల్లిని ఎంకరేజ్ చేసే నిర్మాతగా పేరు తెచ్చుకున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను విజయదశమి సందర్భంగా నిర్వహించనున్నారని సమాచారం. రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రారంభమవుతుందని వినికిడి. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది.
మరి.. తెలుగు - తమిళ భాషల్లో రూపొందనున్న ఈ బైలింగ్వల్ మూవీతో దర్శకుడిగా వంశీ పైడిపల్లి స్థాయి మరింత పెరుగుతుందేమో చూడాలి.