హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్.. ఇండస్ట్రీకి మరో బుచ్చిబాబు వస్తాడా!!
on May 17, 2021
తొలి సినిమా ‘ఉప్పెన’తో వైష్ణవ్ తేజ్ ఘన విజయం అందుకున్నాడు. ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. దాంతో వైష్ణవ్ తేజ్ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో మరో సినిమా చేయనున్నాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నిర్మించే చిత్రం క్రీడల నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా ద్వారా పృథ్వీ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఈ సినిమా హాకీ నేపథ్యంలో రూపొందనుందట. ఇందులో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడని టాక్. హాకీ ప్లేయర్ పాత్రలో ఒదిగిపోవడానికి ఇప్పటికే వైష్ణవ్ కసరత్తులు మొదలుపెట్టారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఉప్పెన' సినిమాతో సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాతో వైష్ణవ్ కి, బుచ్చిబాబుకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వైష్ణవ్ మరో కొత్త దర్శకుడితో చేస్తున్న స్పోర్ట్స్ ఫిల్మ్ తో వెండితెరపై ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.
Also Read