'RT 69' లోనూ మరో సీనియర్ హీరో!
on Oct 13, 2021
`క్రాక్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన మాస్ మహారాజా రవితేజ.. త్వరలో `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాలతో సందడి చేయనున్నారు. తక్కువ గ్యాప్ లోనే ఈ రెండు యాక్షన్ థ్రిల్లర్స్ కూడా థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఆపై `నేను లోకల్` ఫేమ్ త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో మరో సినిమాతో అలరించబోతున్నారు రవితేజ. '#RT 69` అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇదిలా ఉంటే.. `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాల్లో ఎలాగైతే రవితేజతో నిన్నటి తరం కథానాయకులు స్క్రీన్ షేర్ చేసుకున్నారో.. అలాగే త్రినాథరావ్ నక్కిన డైరెక్టోరియల్ లోనూ మరో సీనియర్ హీరో కనిపించబోతున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. `ఖిలాడి`లో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ ప్రధాన పాత్రలో నటించగా.. `రామారావు ఆన్ డ్యూటీ`లో `స్వయంవరం`, `చిరునవ్వుతో` చిత్రాల కథానాయకుడు వేణు తొట్టెంపూడి ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పుడిదే శైలిలో.. రవితేజ - త్రినాథరావ్ నక్కిన కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలోనూ మరో సీనియర్ హీరో దర్శనమివ్వబోతున్నట్లు టాలీవుడ్ టాక్. త్వరలోనే ఆ సీనియర్ హీరో ఎవరో క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.