ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, సిరీస్ లు!
on Jan 24, 2026

ప్రస్తుతం థియేటర్లలో సంక్రాంతి సినిమాల హవానే కొనసాగుతోంది. 'మన శంకర వరప్రసాద్ గారు'తో పాటు 'అనగనగా ఒక రాజు', 'నారీ నారీ నడుమ మురారి', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాలు మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. ఇప్పుడు థియేటర్లలో ఇతర సినిమాల తాకిడి లేదు. అయితే ఓటీటీలో మాత్రం పలు సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
శోభిత ధూళిపాళ ప్రధాన పాత్ర పోషించిన క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో'(Cheekatilo) నేరుగా ఓటీటీలో విడుదలైంది. జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్టీమింగ్ అవుతోంది.
Also Read: 'చీకటిలో' మూవీ రివ్యూ
ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ ఆధారంగా రూపొందిన 'స్పేస్ జెన్ - చంద్రయాన్'(Space Gen: Chandrayaan) వెబ్ సిరీస్ జనవరి 23 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.
Also Read: 'స్పేస్ జెన్ - చంద్రయాన్' రివ్యూ
ఆది సాయికుమార్ రీసెంట్ హిట్ ఫిల్మ్ 'శంబాల'(Shambhala) ఓటీటీలో అడుగు పెట్టింది. ఈ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్, జనవరి 22 నుంచి ఆహాలోకి అందుబాటులోకి వచ్చింది.
Also Read: 'శంబాల' మూవీ రివ్యూ
అమెజాన్ ప్రైమ్ వీడియో:
చీకటిలో మూవీ - జనవరి 23
జియో హాట్ స్టార్:
'స్పేస్ జెన్ - చంద్రయాన్' సిరీస్ - జనవరి 23
మార్క్ మూవీ - జనవరి 23
ఆహా:
శంబాల మూవీ - జనవరి 22
మారియో మూవీ - జనవరి 23
జీ5:
45 మూవీ - జనవరి 23
నెట్ ఫ్లిక్స్:
తేరే ఇష్క్ మే మూవీ - జనవరి 23
ఈటీవీ విన్:
సంధ్యానామ ఉపాసతే మూవీ - జనవరి 22
గొల్ల రామవ్వ చిత్రం - జనవరి 25
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



