
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'రాధే శ్యామ్'. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పీరియాడిక్ గా లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
రాధేశ్యామ్ సినిమాకి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని రంగంలోకి దింపింది మూవీ టీమ్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు తమన్ బీజీఎం అందిస్తాడని తాజాగా యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది.

కొంతకాలంగా తమన్ తన సంగీతంతో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి మార్కులు పడుతున్నాయి. ఇటీవల ఘన విజయం సాధించిన 'అఖండ' సినిమా విజయంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. విజువల్ వండర్ గా వస్తున్నఎమోషనల్ లవ్ జర్నీ అయినటువంటి రాధేశ్యామ్ వంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకం. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ టీమ్ తమన్ ని రంగంలోకి దింపిందని తెలుస్తోంది.







