మీనాక్షిచౌదరికి ఝలక్ ఇచ్చిన శ్రీలీల..అంతా కిస్సిక్ మహత్యం
on Dec 11, 2024
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)ప్రస్తుతం చందు మొండేటి(chandu mondeti)దర్శకత్వంలో 'తండేల్'(thandel)మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.సాయిపల్లవి కథానాయికగా చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ,నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 7 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న తండేల్ మీద,అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి.ఇక ఈ మూవీ తర్వాత చైతు తన నెక్స్ట్ ప్రాజక్ట్ ని 'విరూపాక్ష'తో ఘన విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వంలో చెయ్యబోతున్నాడు. మైథికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ అండ్ 'అత్తారింటికి దారేది'ఫేమ్ బివీఎన్ఎస్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ మూవీలో తొలుత హీరోయిన్ గా పూజాహెగ్డే(pooja hegde)పేరు కూడా తెర మీదకి వచ్చింది.ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా చెలామణి అయిన పూజ ప్రెజంట్ ఖాళీగా ఉండటంతో ఆమెకి చైతు సినిమా ఆఫర్ మంచి అవకాశమని అంతా భావించారు.కానీ ఆ తర్వాత వరుస చిత్రాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి(meenakshi chowdhary)ని పూజా ప్లేస్ లో ఫిక్స్ చేశారనే వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు రీసెంట్ గా మీనాక్షి ప్లేస్ లో శ్రీలీలని తీసుకున్నారని తెలుస్తుంది.ఇప్పుడు శ్రీలీలకి ఈ అవకాశం బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.
ఎందుకంటే గత కొంత కాలం నుంచి శ్రీలీల(sreeleela)డైరీ ఖాళీగా ఉంది. గతంలో వరుస సినిమాల్లో చేసినా కూడా వాటిల్లో ఒకటి,అరా మాత్రమే విజయాన్ని సాధించాయి.దీంతో హిట్ లని మాత్రమే కొలమానంగా తీసుకునే ఇండస్ట్రీలో శ్రీలీలకి ఆఫర్స్ రావడం తగ్గాయి.ఈ సంవత్సరం స్టార్టింగ్ లో కేవలం మహేష్ తో కలిసి గుంటూరు కారంలో మాత్రమే చేసింది.ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి మూవీలో కనపడలేదు,అలాంటిది చైతు మూవీ శ్రీ లీలకి మంచి అవకాశమని చెప్పవచ్చు.ఇక ఇప్పుడు పుష్ప 2 లోని కిస్సిక్ సాంగ్ తో శ్రీలీల పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ లో ఒకటైన ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ రాబిన్ హుడ్ మూవీలు శ్రీలీల లిస్ట్ లో ఉన్నాయి.
Also Read