నాని 'శ్యామ్ సింగరాయ్' నుంచి బిగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
on Oct 18, 2021
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కలకత్తా బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. టైటిల్, పోస్టర్స్ తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read