`ప్రేమమ్` హీరోతో `లవ్ లీ` భామ
on Mar 5, 2021
`లవ్ లీ` (2012) చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఉత్తరాది భామ శాన్వి శ్రీవాస్తవ. ఆపై `అడ్డా`, `రౌడీ`, `ప్యార్ మే పడిపోయానే` వంటి తెలుగు సినిమాల్లో కనిపించిన శాన్వి.. క్రమంగా కన్నడ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. పలు క్రేజీ ప్రాజెక్టులలో నటించి శాండల్ వుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
కట్ చేస్తే.. ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతోంది ఇప్పుడు. అది కూడా.. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఓ యంగ్ హీరో సినిమాతో. ఆ వివరాల్లోకి వెళితే.. `ప్రేమమ్` వంటి ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో మాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన నివిన్ పౌలీ కథానాయకుడిగా `మహావీర్యర్` పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఆసీఫ్ అలీ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని అబ్రిద్ షైన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతోనే `లవ్ లీ` భామ శాన్వి మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
మరి.. తెలుగు, కన్నడ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నట్టే.. కేరళ జనాల ఆదరణను కూడా శాన్వి శ్రీవాస్తవ పొందుతుందేమో చూడాలి.