త్వరలోనే పెళ్లి, పిల్లలు.. సమంత సంచలన పోస్ట్...
on Dec 11, 2024
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పేరు తరచూ వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది. సినిమాలు చేసినా చేయకపోయినా ఆమెకి సంబంధించిన న్యూస్ రావడం మాత్రం కామన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో సంచలన పోస్ట్ పెట్టింది. సమంత పోస్ట్ ని బట్టి చూస్తే.. 2025 లో ఆమె రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా, పిల్లలను కనడానికి సైతం రెడీ అని హింట్ ఇచ్చినట్లుగా ఉంది.
వచ్చే 2025 సంవత్సరం తన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుపుతూ తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. అందులో కొన్ని ఆసక్తికర పాయింట్ లు ఉన్నాయి. "ఏడాదంతా బిజీగా ఉంటారు. బాగా డబ్బులు సంపాదిస్తారు. వృత్తిపరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఎన్నో ఏళ్ల నాటి కళలు సాకారమవుతాయి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు" వంటి పాయింట్స్ ఉన్నాయి. అయితే వీటన్నింటి కంటే కూడా ఒక రెండు పాయింట్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అవేంటంటే "ప్రేమించే భాగస్వామి వస్తాడు", "సంతానానికి అనువైన సమయం" అని రాసి ఉన్నాయి. సమంత పెట్టిన పోస్ట్ ని, అందులోని పాయింట్ లను బట్టి చూస్తే.. ఆమె 2025 లో పెళ్లికి సిద్ధమవుతుందని అనిపిస్తోంది.
దీంతో పాటు, ఇన్ స్టాగ్రామ్ లో మరో పోస్ట్ కూడా పెట్టింది సమంత. అందులో "కొన్ని సంవత్సరాలు మీరు గెలుస్తారు. కొన్ని సంవత్సరాలు మీరు క్యారెక్టర్ ను బిల్డ్ చేసుకుంటారు" అంటూ స్టీవ్ జాబ్స్ చెప్పిన కోట్ ని సమంత పంచుకుంది. "ఇప్పటిదాకా క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్నాను, ఇప్పుడు గెలిచే టైం వచ్చింది." అనే ఉద్దేశంతో సమంత ఈ పోస్ట్ పెట్టినట్లు అనిపిస్తోంది. మరి సమంత కోరుకుంటున్నట్లుగా 2025 లో ఆమె జీవితంలో సరికొత్త వెలుగులు నిండుతాయేమో చూడాలి.
Also Read