`థాంక్ యూ`లో సామ్ స్పెషల్ రోల్?
on Mar 5, 2021
`మనం` తరువాత వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో యువ సామ్రాట్ నాగచైతన్య చేస్తున్న చిత్రం `థాంక్ యూ`. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. `థాంక్ యూ`లో చైతూకి జోడీగా ముగ్గురు నాయికలు నటిస్తున్నారని.. వారిలో ఒకరైన మాళవికా నాయర్ ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటోందని కథనాలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో చైతూ శ్రీమతి, స్టార్ హీరోయిన్ సమంత ఓ స్పెషల్ రోల్ లో దర్శనమివ్వనుందట. కథని కీలక మలుపు తిప్పే అతిథి పాత్రలో సామ్ కనిపిస్తుందని టాక్. త్వరలోనే `థాంక్ యూ`లో సామ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. సామ్ స్పెషల్ రోల్ `థాంక్ యూ`కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, ఈ ఏడాది ద్వితీయార్ధంలో `థాంక్ యూ` థియేటర్స్ లో సందడి చేయనుంది. అంతకంటే ముందు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ నటించిన `లవ్ స్టోరీ` రిలీజ్ కానుంది. ఏప్రిల్ 16న `లవ్ స్టోరీ` తెరపైకి రానుంది.