దీపావళికి `రామారావు ఆన్ డ్యూటీ` సర్ప్రైజ్!
on Oct 28, 2021
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ చేస్తున్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒకటి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రవితేజ ఓ ప్రభుత్వ ఉద్యోగిగా దర్శనమివ్వనున్నారు. శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రవితేజకి జంటగా `మజిలీ` ఫేమ్ దివ్యాంశ కౌశిక్, `కర్ణన్` ఫేమ్ రాజీషా విజయన్ నటిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న `రామారావు ఆన్ డ్యూటీ`.. వచ్చే ఏడాది ఆరంభంలో థియేటర్స్ లోకి రానుంది.
ఇదిలా ఉంటే.. `రామారావు ఆన్ డ్యూటీ`కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారట. త్వరలోనే `రామారావు ఆన్ డ్యూటీ` ఫస్ట్ గ్లింప్స్ కి సంబంధించి క్లారిటీ రానుంది.
కాగా, `రామారావు ఆన్ డ్యూటీ` కంటే ముందే `ఖిలాడి`తో పలకరించబోతున్నారు రవితేజ. రమేశ్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు.. `ధమాకా` పేరుతో త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమాని పట్టాలెక్కించారు మాస్ మహారాజా. మరి.. `క్రాక్` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత రాబోతున్న ఈ చిత్రాలన్నీ రవితేజకి ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.
Also Read