రష్మికకి గాయాలు.. షూటింగ్స్ క్యాన్సిల్..!
on Jan 11, 2025
పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక ముందు వరుసలో ఉంటుంది. 'యానిమల్', 'పుష్ప-2' వంటి భారీ విజయాలతో రష్మిక ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో 'సికందర్', 'ది గర్ల్ ఫ్రెండ్', 'కుబేర'తో పాటు పలు సినిమాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలకు ఊహించని దెబ్బ తగిలింది. పలు సినిమాల షూటింగ్ లు వాయిదా పడనున్నాయి. ఇంకా షూటింగ్ మొదలు కాని సినిమాలు ఆలస్యంగా మొదలు కానున్నాయి. (Rashmika Mandanna)
రీసెంట్ గా రష్మిక తీవ్రంగా గాయపడిందని, దీంతో కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా రష్మికకు గాయాలు అయినట్లు సమాచారం. నిజానికి రష్మిక.. సల్మాన్ ఖాన్ తో కలిసి ఈ శుక్రవారం నుంచి 'సికందర్' మూవీ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ కోసం ముంబైలో భారీ సెట్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు రష్మిక గాయపడటంతో 'సికందర్' షూటింగ్ వాయిదా పడినట్లు టాక్. విశ్రాంతి తీసుకొని పూర్తిగా కోలుకున్న తర్వాత రష్మిక మళ్ళీ ఈ షూటింగ్ లో పాల్గొననుంది. కానీ అప్పటికి మిగతా ఆర్టిస్ట్ ల డేట్స్ అందుబాటులో ఉంటాయో లేదో అనుమానమే. ఈ లెక్కన 'సికందర్' షూటింగ్ ఎంతో కొంత ఆలస్యమయ్యే అవకాశముంది. ఆ ప్రభావం రష్మిక నటిస్తున్న మిగతా సినిమాలపై పడుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తయితే ఓకే కానీ.. షూటింగ్ దశలో ఉన్న సినిమాలపై మాత్రం బాగానే ఎఫెక్ట్ పడుతుంది. మరి రష్మిక త్వరగా కోలుకొని మళ్ళీ త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటుందేమో చూడాలి.
మరోవైపు రష్మిక గాయపడిందని తెలిసి అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సన్నిహిత వర్గాల సమాచారం.
Also Read