Home

»

Latest News

Peddi: 'పెద్ది' నా కెరీర్‌లోనే నెంబర్ 1 సినిమా.. రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు!

Jun 9, 2026 11:23AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబినేషన్‌లో వచ్చిన మూవీ 'పెద్ది' (Peddi). వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఐదు రోజుల్లోనే ఈ మూవీ రూ.315 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.

'పెద్ది' మూవీ భారీ వసూళ్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం థాంక్యూ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, దర్శకుడు బుచ్చిబాబుకు అలాగే తన చిత్ర యూనిట్ మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సినిమాలో భాగం కావడం, షూటింగ్ ప్రక్రియ ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని చరణ్ పేర్కొన్నారు.

అంతేకాదు, తన సినీ కెరీర్‌లోనే ఈ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. "నా సినిమా కెరీర్‌లో, నా పర్సనల్ లైబ్రరీలో నెంబర్ వన్ లేదా నెంబర్ టూ స్థానాల్లో నిలిచిపోయే ఒక అద్భుతమైన సినిమాను బుచ్చిబాబు నాకు ఇచ్చారు" అంటూ చరణ్ చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ స్పీచ్‌కు సంబంధించిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో మరో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com