పెద్ది ఓటిటి డీల్ ఇదేనా!..ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి
on Dec 1, 2025

-పెద్ది కి నెట్ ఫ్లిక్స్ కి మధ్య ఏం జరిగింది
-పాజిటివ్ వైబ్రేషన్స్
-చరణ్ ఫ్యాన్స్ హంగామా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)'పెద్ది' నెక్స్ట్ ఇయర్ మార్చి 26 న పాన్ ఇండియా స్థాయిలో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అంటే ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. కానీ
ఇప్పట్నుంచే 'పెద్ది'(Peddi)ఫీవర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో చాలా బలంగా చొచ్చుకొని పోయింది. చికిరి సాంగ్ రిలీజ్ తో అయితే ఆ ఫీవర్ పతాక స్థాయికి చేరడంతో పాటు రికార్డులే తరువాయి అని ముక్త కంఠంతో చెప్తున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో 'పెద్ది' ఓటిటి డీల్ కి సంబంధించిన విషయం అభిమానుల్లో జోష్ ని తెప్పిస్తుంది.
ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సంస్థ 130 కోట్లరూపాయిల భారీ మొత్తానికి అన్ని భాషల డిజిటల్ రైట్స్ ని కైవసం చేసుకున్నట్టుగా టాక్. ఈ వార్త నిజమైతే కనుక షూటింగ్ పూర్తికాకముందే అంత భారీ మొత్తానికి ఓటిటి డీల్ ని పొందటం ఒక అరుదైన రికార్డు అని చెప్పవచ్చు. కాకపోతే ఈ విషయంపై అధికార ప్రకటన లేదు. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారడంతో అభిమానులు స్పందిస్తు చరణ్ కి పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న క్రేజ్ కి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చనే కామెంట్స్ చేస్తున్నారు.
also read: నేడు సమంత పెళ్లి!.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
పెద్ది ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ని జరుపుకుంటుంది. భారీ గా వేసిన సెట్ లో చరణ్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పై బాలీవుడ్ స్టంట్ మాస్టర్ షామ్ కౌశల్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. సదరు యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలవబోతున్నాయని తెలుస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు(Buchibabu)ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్దిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు.'ఏఆర్ రెహ్మాన్'(Ar Rehman)కూడా 'చికిరి' కి మించిన ట్యూన్స్ ని సిద్ధం చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్(Sukumar) రైటింగ్స్ సహకారంతో వృద్ధి సినిమాస్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



