ఐడీ కార్డ్ తో తారక్.. సెట్ లో ఇదే ఫస్ట్ టైమ్
on Aug 5, 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా సెట్ లో తారక్ మెడలో ఐడీ కార్డ్ వేసుకొని ఫోటోకి ఫోజు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా తారక్ తాను సెట్స్ లో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో తారక్ మెడలో ఐడీ కార్డు వేసుకుని కనిపించారు. ఫోటోలో తారక్ తో పాటు రాజమౌళి కూడా ఐడీ కార్డ్ పట్టుకొని చూపిస్తున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఐడీ కార్డు ధరించానని, సెట్స్ లో ఐడీ కార్డ్ వేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ అని తారక్ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక తారక్ ఐడీ కార్డ్ పై 'నందమూరి తారకరామారావు.. హీరో' రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఐడీ కార్డ్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తారక్ 'ఆర్ఆర్ఆర్'లో కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 13 న విడుదల కానుంది.