మోహన్ బాబు అరెస్ట్!
on Dec 10, 2024
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(mohan babu)ఆయన కుమారుడు మనోజ్(manoj)మధ్య గత రెండు రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఆస్తులకి సంబంధించిన విషయంలో గొడవ జరుగుతుందని మొదట్లో అందరు అనుకున్నా కూడా నిన్న మనోజ్ చెప్పిన విషయంతో ఆస్తుల గొడవ కాదని తేలిపోయింది.ఇక నిన్న రాత్రి మనోజ్ జల్లేపల్లి లోని మోహన్ బాబు నివాసానికి వెళ్లి తన కూతుర్ని చూపించాలని గొడవ చేసాడు.ఆ సమయంలో మనోజ్ షర్ట్ కూడా చినిగిపోయింది.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లడం జరిగింది.మోహన్ బాబు ని గొడవ గురించి ఒక మీడియా సంస్థకి చెందిన విలేకరి అడుగుతుండగా మోహన్ బాబు కోపంతో అతని దగ్గర మైక్ లాక్కొని దాంతోనే అతని చెవి దగ్గర బలంగా కొట్టడంతో సదరు జర్నలిస్ట్ ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.ఇప్పుడు ఈ సంఘటనతో తెలంగాణ జర్నలిస్టుల సంఘం మోహన్ బాబుని అరెస్ట్ చేయాలనే డిమాండ్ చేస్తుంది.అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కూడా సిద్ధమవుతామని బహిరంగంగానే ప్రకటించాయి.పోలీసులు కూడా ఈ సంఘటనని సీరియస్ గా తీసుకోవడంతో మోహన్ బాబు అరెస్ట్ అవుతాడా అనే చర్చ జరుగుతుంది.
Also Read