దీపావళి బరిలో `ఆచార్య`.. మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్?
on Aug 4, 2021
ప్రస్తుతం తెలుగునాట క్రేజీ ప్రాజెక్ట్స్ తాలుకూ రిలీజ్ డేట్స్ అనౌన్స్మెంట్స్ సందడి సాగుతోంది. `రాధే శ్యామ్`, `ఆర్ ఆర్ ఆర్`, `సర్కారు వారి పాట`, `పుష్ప` (ఫస్ట్ పార్ట్), `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్.. ఇలా దసరా నుండి సంక్రాంతి వరకు రాబోయే పలు బిగ్ టికెట్ ఫిల్మ్స్ కి సంబంధించి విడుదల తేదీలపై పక్కాగా అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ సరసన చేరే మరో భారీ బడ్జెట్ మూవీ `ఆచార్య` విడుదల తేదిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. దీపావళి కానుకగా నవంబర్ 4న `ఆచార్య`ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన మరికొద్ది రోజుల్లో రావచ్చని టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇదే సీజన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం `అణ్ణాత్తే` కూడా రాబోతోంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాదం కాబోతోంది. ఒకవేళ `ఆచార్య` దీపావళికి ఫిక్స్ అయితే.. మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్ తప్పదన్నమాట. చూద్దాం.. ఏం జరుగుతుందో?
కాగా, `ఆచార్య`లో మరో హీరోగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సోషల్ డ్రామాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.
Also Read