'మా' అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన మంచు విష్ణు
on Oct 13, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈరోజు(బుధవారం ) బాధ్యతలను స్వీకరించారు. అనంతరం అధ్యక్ష హోదాలో పెన్షన్ ఫైల్ పై తొలి సంతకం చేశారు విష్ణు.
ఆదివారం జరిగిన మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు మా అధ్యక్షుడిగా విష్ణు బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని విష్ణు ట్విట్టర్ వేదికగా తెలిపారు. "మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను. మీ అందరి మద్ధతు నాకు కావాలి" అంటూ విష్ణు ట్వీట్లో పేర్కొన్నారు.
మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన వారందరూ రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాల అంశంపై మా అధ్యక్షుడి హోదాలో విష్ణు ఎలా వ్యవహరిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. మరి విష్ణు.. ప్రకాష్ రాజ్ ప్యానల్ తో మాట్లాడి వారిని కలుపుకుని పోతారా? లేక వారి స్థానంలో తన ప్యానల్ నుండి పోటీ చేసి ఓడిపోయిన వారికి అవకాశం కల్పిస్తారా? అనేది వేచి చూడాలి.
Also Read