'మన శంకర వరప్రసాద్ గారు' ఫస్ట్ రివ్యూ.. బిగ్ షాకిచ్చిన అనిల్ రావిపూడి!
on Jan 11, 2026

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన దర్శకత్వంలో ఇప్పటిదాకా ఎనిమిది సినిమాలు రాగా ఒక్క ఫ్లాప్ కూడా ఎదురుకాలేదు. ముఖ్యంగా గత సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో రీజినల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఇప్పుడు తన తొమ్మిదో సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'తో థియేటర్లలో అడుగుపెడుతున్నారు. (Mana Shankara Vara Prasad Garu)
ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారు అనిల్ రావిపూడి. పైగా సంక్రాంతి కానుకగా 'మన శంకర వరప్రసాద్ గారు' వస్తోంది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపుతున్నారు. అయితే 'సంక్రాంతికి వస్తున్నాం'లా ప్రతిసారీ మ్యాజిక్ జరగడం కష్టమని, ఈసారి అనిల్ కి షాక్ తగలడం ఖాయమని అంచనా వేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ.. రావిపూడి బిగ్ షాక్ ఇవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
శనివారం రాత్రి 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రత్యేక షోని ప్రదర్శించారు. మూవీ టీంతో పాటు ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు చూశారట. సినిమా అదిరిపోయింది, ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడతారు, 'సంక్రాంతికి వస్తున్నాం'ని మించి విజయం సాధించడం ఖాయమని చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారని తెలుస్తోంది.
ఇప్పటికే ప్రచార చిత్రాలతో 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. అడ్వాన్స్ సేల్స్ పరంగా మొదటిరోజు వరల్డ్ వైడ్ గా ఇప్పటికే రూ.25 కోట్ల గ్రాస్ మార్క్ దాటింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మరికొద్ది గంటల్లో థియేటర్లలో అడుగుపెట్టనుంది ఈ చిత్రం. జనరల్ ఆడియన్స్ నుంచి కూడా ఇదే రెస్పాన్స్ వస్తే.. 'సంక్రాంతి వస్తున్నాం' తరహాలో బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయం. అదే జరిగితే అనిల్ రావిపూడి క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
'సైంధవ్' వంటి డిజాస్టర్ తర్వాత 'సంక్రాంతి వస్తున్నాం' రూపంలో వెంకటేష్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు అనిల్ రావిపూడి. 'భోళా శంకర్' వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు'తో కూడా మరో బ్లాక్ బస్టర్ ఇస్తే ఇండస్ట్రీలో రావిపూడి క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది అనడంలో డౌట్ లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



