`ఖిలాడి`తో హ్యాట్రిక్ దక్కేనా?
on Mar 5, 2021
`జనతా గ్యారేజ్`(2016)తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. యంగ్ టైగర్ యన్టీఆర్ కథానాయకుడిగా నటించిన సదరు యాక్షన్ డ్రామాలో మోహన్ లాల్ కి కొడుకు పాత్రలో నెగటివ్ టచ్ ఉన్న రోల్ లో కనిపించాడు ఉన్ని. ఆ సినిమా సాధించిన ఘనవిజయంతో ఆపై లేడీ సూపర్ స్టార్ అనుష్క టైటిల్ రోల్ లో నటించిన `భాగమతి`(2018)లో ఓ కీలక పాత్రలో యాక్ట్ చేసే అవకాశం అందిపుచ్చుకున్నాడు ఉన్ని ముకుందన్. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో.. టాలీవుడ్ లో ఉన్నికి ప్రత్యేక గుర్తింపు దక్కింది.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం ఈ టాలెంటెడ్ యాక్టర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. ఆ సినిమానే.. మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ `ఖిలాడి`. రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ పాత్ర చాలా కీలకమట. రవితేజ, ఉన్ని కాంబినేషన్ లో వచ్చే సీన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. మరి.. `జనతా గ్యారేజ్`, `భాగమతి` చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న ఉన్ని ముకుందన్.. `ఖిలాడి`తో ఆ పరంపరని కొనసాగించి హ్యాట్రిక్ అందుకుంటాడేమో చూడాలి. అలాగే.. భవిష్యత్ లోనూ తెలుగునాట స్టార్ టికెట్ ఫిల్మ్స్ కే పరిమితమవుడా? అన్నది కూడా ఉన్ని ముకుందన్ విషయంలో ఆసక్తికరమే.
కాగా, మే 28న `ఖిలాడి` థియేటర్స్ లో సందడి చేయనుంది.