ప్రియాంక.. హ్యాట్రిక్ కొడుతుందా?
on Aug 4, 2021
`టాక్సీవాలా` (2018)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమాతోనే ఓ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలాగే, యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ సరసన కనువిందు చేసింది. `టాక్సీవాలా` హిట్ అయినా.. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ తెలుగమ్మాయి. ఈ క్రమంలోనే.. నటనకు ప్రాధాన్యమున్న `తిమ్మరుసు`, `ఎస్. ఆర్. కళ్యాణమండపం` చిత్రాలకు ఓటేసింది.
కోవిడ్ ఎఫెక్ట్ తో విడుదల విషయంలో జాప్యం జరిగినా.. ఎట్టకేలకు ఈ రెండు సినిమాలు వారం వ్యవధిలో థియేటర్స్ ని టార్గెట్ చేసుకున్నాయి. గత శుక్రవారం (జూలై 30) `తిమ్మరుసు` విడుదల కాగా.. ఈ శుక్రవారం (ఆగస్టు 6) `ఎస్.ఆర్. కళ్యాణమడపం` రిలీజ్ కానుంది. కాగా, సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన `తిమ్మరుసు` మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే రాబడుతోంది. ఈ నేపథ్యంలో.. మంచి అంచనాలతో, సూపర్ హిట్ సాంగ్స్ తో ఈ వారం వస్తున్న `ఎస్.ఆర్. కళ్యాణమండపం` కూడా విజయం సాధించి ప్రియాంకకి హ్యాట్రిక్ అందిస్తుందేమో చూడాలి.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన `కళ్యాణ మండపం`లో సాయికుమార్ ముఖ్య పాత్ర పోషించాడు. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ ఛైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చాడు.
Also Read