రామ్ చరణ్ చిత్రంలో కమల్ హాసన్?
on Jul 29, 2021
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే ఎన్నడూ లేనంత ఫుల్ ఫామ్ లో ఉన్నారిప్పుడు. ఒకవైపు దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`.. మరోవైపు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న `ఆచార్య`ని పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు చరణ్. ఈ రెండు సినిమాలు కూడా మల్టిస్టారర్సే. `ఆర్ ఆర్ ఆర్`లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చరణ్.. `ఆచార్య`లో తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్నారు.
కట్ చేస్తే.. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమాలోనూ మరో స్టార్ హీరో తో కలిసి నటించబోతున్నారట రామ్ చరణ్. ఆ స్టార్ మరెవరో కాదు.. లోక నాయకుడు కమల్ హాసన్. కథలో కీలకమైన ఓ పాత్ర కోసం ఇటీవల కమల్ ని సంప్రదించారట శంకర్. పాత్ర నచ్చడంతో కమల్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. త్వరలోనే చరణ్ - శంకర్ కాంబో మూవీలో కమల్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
కాగా, శంకర్ - కమల్ కాంబినేషన్ లో వచ్చిన `భారతీయుడు` (1996) బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా ప్లాన్ చేసిన `భారతీయుడు 2`.. కొంతమేర చిత్రీకరణ జరుపుకుని కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా ఆగిపోయింది. త్వరలోనే ఈ సీక్వెల్ మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
మరి.. కమల్ తో తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోనున్న చరణ్.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.