Home

»

Latest News

ఎన్టీఆర్ 30 మ్యూజిక్ వర్క్స్ స్టార్ట్

May 18, 2020 12:53PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 'అరవింద సమేత వీర రాఘవ' వంటి హిట్ ఫిల్మ్ వచ్చింది. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న టైటిల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అది పక్కన పెడితే... ఆల్రెడీ ఈ సినిమా మ్యూజిక్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. హీరోగా ఎన్టీఆర్ 30వ సినిమా ఇది.‌

'అరవింద సమేత వీర రాఘవ' చిత్రానికి అదిరిపోయే పాటలు అంతకుమించి బీభత్సమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన యువ సంగీత సంచలనం తమన్, ఈ ఎన్టీఆర్30కి మ్యూజిక్ డైరెక్టర్. హిట్ కాంబినేషన్ సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో అంచనాలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని, అందుకు తగ్గట్టు ఈసారి హిట్ మ్యూజిక్ ఇస్తానని, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశానని తమన్ అన్నాడు. ఏం చేస్తే బాగుంటుంది? థీమ్ ఎలా ఉండాలి? అని ఆలోచించి పెట్టుకున్నాననీ, త్రివిక్రమ్ ఇన్ పుట్స్ ఇవ్వడం ప్రారంభిస్తే అసలు పని మొదలు పెడతానని తమన్ తెలిపాడు. దర్శకుడు త్రివిక్రమ్ తో అతడికి హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ చిత్రానికి, అరవింద్ సమేతకి మధ్య 'అల వైకుంఠపురములో' సినిమా చేసిన సంగతి తెలిసిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com