సంగీత దిగ్గజం ఘంటసాల బయోపిక్.. రిలీజ్ ఎప్పుడంటే..?
on Dec 3, 2025

ఇప్పటికే ఎన్టీఆర్, సావిత్రి వంటి తెలుగు సినీ దిగ్గజాల బయోపిక్ లు చూశాం. త్వరలో తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు, దిగ్గజ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు బయోపిక్ చూడబోతున్నాం.
ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'ఘంటసాల' పేరుతో చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఘంటసాల జీవితంలోని విభిన్న ఘట్టాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించి, ప్రివ్యూ షోలతోనే ప్రేక్షకుల మెప్పు పొందారు.
ఘంటసాల వీరాభిమానుల కోరిక మేరకు లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ప్రత్యేక ప్రీవ్యూ షోలు నిర్వహించగా.. అక్కడ నివసిస్తున్న భారతీయులు ఈ చిత్రాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఘంటసాల గాత్రాన్ని, మహిమను మరోసారి అనుభవించేలా ఈ సినిమా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా బయోపిక్ ని రూపొందించిన దర్శకుడు సి.హెచ్. రామారావుపై ప్రశంసలు కురిపించారు.
Also Read: విడుదలకు కొన్ని గంటల ముందు లీక్.. అఖండ-3 టైటిల్ ఇదే..!
ప్రివ్యూ షోలతో ప్రశంసలు అందుకున్న ఘంటసాల బయోపిక్.. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలను కూడా పంచుకున్నారు. డిసెంబర్ 5న హైదరాబాద్‌లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
ఘంటసాల అమరగానాన్ని, ఆయన అసామాన్య జీవితాన్ని మరోసారి గుర్తు చేసేలా రూపొందించిన ఈ సినిమా కోట్లాది మంది ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు మేకర్స్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



