గేమ్ ఛేంజర్.. మెగా సర్ ప్రైజ్ వచ్చేసింది!
on Sep 7, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు 'గేమ్ ఛేంజర్' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. (Game Changer Second Single)
థమన్ సంగీతం అందిస్తున్న 'గేమ్ ఛేంజర్' నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ గా 'జరగండి' సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. నేడు వినాయక చవితి సందర్భంగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సెకండ్ సింగిల్ ను ఈ సెప్టెంబర్ నెలలోనే విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ను వదిలారు. పోస్టర్ కలర్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ క్లాస్ దుస్తులు వేసుకొని, తలకి ఎర్ర తువాలు కట్టుకొని స్టైలిష్ గా ఉన్నాడు. పోస్టర్ ని బట్టి చూస్తే సెకండ్ సింగిల్ అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ అనిపిస్తోంది.
కియారా అద్వాణి హీరోయిన్ గా నటిస్తున్న ఎస్.జె.సూర్య, అంజలి, సునీల్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read