నా కొడుకు సినిమాలో ఏం వెతికినా దొరకదు..ఎవరు కూడా పీకలేరు
on Oct 1, 2024
ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్(prabhakar)కొడుకు చంద్ర హాస్(chandrahass)హీరోగా పరిచయమవుతున్న చిత్రం రామ్ నగర్ బన్నీ(ram nagar bunny).విస్మయశ్రీ, రిచా జోషి,అంబికా వాణి, రీతు మంత్ర హీరోయిన్లు గా చేస్తుండగా బలగం మురళి గౌడ్ ముఖ్య పాత్రలో చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ కూడా సినిమా మీద అందరిలో అంచనాలు పెంచేలా చేసింది.
రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరగగా అందులో ప్రభాకర్ మాట్లాడుతూ మా అబ్బాయి చంద్ర హాస్ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.మీరు సినిమాని, నా బిడ్డని దృష్టిలో పెట్టుకొని చూస్తారో లేక ఎలా చూస్తారో తెలియదు గాని సినిమా చూస్తున్నంత సేపు వెతికినా ఏం దొరకదు. ఎంటర్ టైన్మెంట్ మాత్రమే ఉంటుంది.ఇన్ని రోజులు ఎలా అయితే సక్సెస్ కొట్టి చూపించానో, మా అబ్బాయి సినిమా ద్వారా కూడా హిట్ కొట్టి చూపిస్తాను.అలాగే మన పని మనం సిన్సియర్ గా చేసుకుంటూ పోతే ఎవడు ఏం పీకలేడని తెలిపాడు.
చంద్ర హాస్ గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. నా కొడుకు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డటమే కాకుండా చాలా మాటలు కూడా పడ్డాడు. వాటన్నిటికీ సినిమా ద్వారానే సమాధానం చెప్పబోతున్నాడని తెలిపాడు. సుమనోహర ప్రొడక్షన్స్ పై ప్రభాకర్ నే నిర్మించడంతో పాటుగా మూవీలో ఒక కీలక పాత్ర కూడా పోషించాడు.శ్రీనివాస్ మహతి(srinivas mahathi)దర్శకడు కాగా అశ్విన్ హేమంత్ సంగీతాన్ని అందిస్తున్నాడు.అక్టోబర్ 4 న విడుదల కానుండగా మార్తాండ్ కె వెంకటేష్(marthand k venkatesh)ఎడిటర్ గా చెయ్యడం విశేషం.
Also Read