వరుణ్ తో వెంకీ యాక్షన్ ఎంటర్టైనర్!
on Oct 19, 2021
`ఛలో`, `భీష్మ` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు యువ దర్శకుడు వెంకీ కుడుముల. ఈ నేపథ్యంలో.. వెంకీ హ్యాట్రిక్ మూవీపై ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వెంకీ తన మూడో చిత్రాన్ని చేయబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. వరుణ్, వెంకీ ఫస్ట్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా.. `భీష్మ` తరహాలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. అంతేకాదు.. ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి వచ్చే అవకాశముందని టాక్. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వరుణ్ తేజ్ `ఎఫ్ 3`, `గని` చిత్రాలతో బిజీగా ఉన్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న `గని` డిసెంబర్ 3న విడుదల కానుండగా.. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా అనిల్ రావిపూడి నిర్దేశకత్వంలో తెరకెక్కుతున్న `ఎఫ్ 3` 2022 ఆరంభంలో థియేటర్స్ లోకి రానుంది. ఈ రెండు చిత్రాల్లోనూ ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో సందడి చేయనున్నారు వరుణ్ తేజ్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
