ధనుష్ తో రాశీ ఖన్నా రొమాన్స్?
on Aug 3, 2021
కోలీవుడ్ స్టార్ ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా.. `తొలిప్రేమ` ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మరో చిత్రం చేయబోతున్నాడీ వెర్సటైల్ యాక్టర్. వీటిలో శేఖర్ కమ్ముల డైరెక్టోరియల్ ముందుగా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ తరువాతే వెంకీ అట్లూరి సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. వెంకీ అట్లూరి కాంబినేషన్ మూవీలో ధనుష్ కి జోడీగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటించబోతోందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. విద్యావ్యవస్థలోని లోపాలపై పోరాటం చేసే యువకుడి కథతో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. కాగా, ఈ చిత్రంలో మరో హీరోయిన్ కి కూడా స్థానముందట. ఆ పాత్రలో స్టన్నింగ్ బ్యూటీ రాశీ ఖన్నా కనిపిస్తుందని బజ్. పాత్ర పరిధి తక్కువే అయినా అభినయానికి ఆస్కారం ఉండడంతో ఈ బైలింగ్వల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట రాశి. అలాగే, తనకు `తొలిప్రేమ` (2018) వంటి మెమరబుల్ మూవీని అందించిన దర్శకుడు నుంచి వచ్చిన ఆఫర్ కావడంతో వెంటనే ఓకే చెప్పిందట. త్వరలోనే ధనుష్ - వెంకీ అట్లూరి కాంబినేషన్ మూవీలో రాశి ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
Also Read